ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు నిత్యం 300 మిల్లీగ్రాముల కన్నా తక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ ను తీసుకోవచ్చు. అదేవిధంగా హై బీపీ ఉన్నవారు నిత్యం 200 మిల్లిగ్రాముల కన్నా తక్కువ కొలెస్ట్రాల్ ను తీసుకోవాలి. కానీ కోడిగుడ్లలో 213 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ ఉంటుంది.అంటే వారు తీసుకోవాల్సిన దాని కంటే కొంచెం అంటే 13 గ్రాముల కొవ్వు అధికంగా ఉంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు వీటిని ఏ మాత్రం తినకూడదు. అని స్పష్టమవుతోంది. అయితే బీపీ కంట్రోల్ లో ఉండి, అన్ని జాగ్రత్తలు పాటించే వారు కోడి గుడ్లను తినవచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు