ఉసిరికాయ,తానికాయ, కరక్కాయ... ఈ మూడు కాయలను కలిపి త్రిఫలాలు అంటారు. వీటితో తయారు చేసిందే త్రిఫల చూర్ణం. ఈ చూర్ణాన్ని పాలు, నీళ్ళు లేదా తేనె ఇలా ఏదో ఒక దానితో కలిపి తీసుకోవడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ముఖ్యంగా సోరియాసిస్,జలుబు,దగ్గు, అజీర్తి సమస్యలు, నోటిపూత,చిగుళ్ల వాపు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు..