మహిళల్లో గర్భం దాల్చేటప్పుడు చాలా మందికి ప్రెగ్నెన్సీలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. వీటిని చూసే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు..మొదటగా ఎక్కువసార్లు టాయిలెట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు కారణం యుటెరస్ బ్లాడర్ మీద ఒత్తిడి పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది. ఇక యుటెరస్ సైజు పెరిగే కొద్దీ సమస్య కూడా పెరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ మొదట్లో వజైనల్ డిశ్చార్జ్ కూడా కామనే. కానీ మొదటి మూడు నెలల్లో చాలామందికి ఎల్లో అలాగే వైట్ కలర్ లో డిశ్చార్జ్ అవుతుంది. ఇది హార్మోన్ అసమతుల్యత వల్ల జరుగుతుంది. ఇక శరీర ఉష్ణోగ్రత కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అంటే అటు జ్వరం వచ్చిన అంత కాకపోయినా, తాకితే వేడిగా అనిపించవచ్చు. అయితే అందరికీ ఇలా జరగక పోవచ్చు కానీ జరిగినా కంగారు పడవలసినంత అవసరం అయితే ఏమీ లేదు