కరోనా వ్యాక్సిన్ వేయించుకోకముందు, ఇక వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తీసుకోవలసిన పదార్థాలు ఏంటంటే పాలకూర, తోటకూర, బ్రోకలీ, గ్రీన్ ఆపిల్ వంటి ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు, బీటాకెరోటిన్, విటమిన్ సి, కె, బీ, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ వేసుకున్న భాగంలో వాపు ఇతర శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు..ఇక తీసుకోకూడని పదార్థాలు ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఉండే అధిక క్యాలరీలు,సాచ్యురేటెడ్ కొవ్వులు రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా టీకా వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే చక్కెర అధికంగా ఉండే పదార్థాలు కూడా తీసుకోకూడదు. ఇక మద్యపానం చేసే వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి కొన్ని వారాల ముందు నుంచి, ఇక వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని వారాల తరువాత మధ్యపానం అలవాటును పూర్తిగా దూరం పెట్టాలి.