కేవలం రెండు నిమిషాల్లోనే కరోనాను గుర్తించే పరికరాన్ని , చెన్నై కీజ పక్కం లోని కేజీ ఆసుపత్రి పీజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు తయారుచేశారు. కేజే కోవిడ్ ట్రాకర్ పేరుతో డిజైన్ చేసిన ఈ పరికరం తయారీకి నానో సాంకేతికను వినియోగించారు. ఇక ఈ పరికరం చెయ్యి ఆకారంలో ఉంటుంది. ఇక ఈ పరికరంలో ఒక సెన్సార్ ను అమర్చారు . దీనిని లాప్ టాప్ కు అనుసంధానించి ఉపయోగించవచ్చు.ఈ పరికరం ఖచ్చితమైన రిజల్ట్ ఇచ్చిందని, ఆర్టీ పీ సీ ఆర్ తో పోలిస్తే మరింత కచ్చితత్వంతో, వేగంగా ఫలితాలను సాధించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని , పరిశోధకులు వెల్లడించారు.