ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలలో ఉచితంగా ఆహారధాన్యాలను సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్కో లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ద్వారా ఎంతోమంది వలస వచ్చిన బాధితులకు ఎంతగానో సహాయ పడుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని, దీని కోసం తాము 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.