నిమ్మకాయ ఆరోగ్యానికి చాల మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిమ్మరసం తాగడానికి కాలంతో పనిలేదు. శీతాకాలం, వేసవికాలం ఏ సమయంలో అయినా నిమ్మరసం తాగేందుకు వెనుకాడరు. శరీరానికి తేమ అందించే విధంగా పనిచేస్తుంది. నిమ్మరసం తాగడం వలన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది.