వేడి నీటిని తాగడం వల్ల కరోనా చస్తుంది అనేది అపోహ మాత్రమే అని వైద్య నిపుణులు వెల్లడించారు.ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువగా ఉండి, ఆయాసం ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి అని కూడా వారు సూచిస్తున్నారు.కరోనా సోకిన మొదటి మూడు నుంచి నాలుగు రోజుల్లో ఫావి ఫిరావిర్ లేదా ఫాబి ఫ్లూ మందులను వాడవచ్చు. ఇక డెక్సామెథజోన్ అనే స్టెరాయిడ్ కరోనాకు చెక్ పెట్టడంలో బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.