పొయ్యి వెలిగించి , ఒక గుండ్రటి గిన్నె పెట్టి, అందులో ఒకటిన్నర గ్లాసుల నీటిని పోసి, దానిలో తిప్పతీగ కాడ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి, ఆ తర్వాత తిప్పతీగ ఆకులు వేసి ,ఆ తర్వాత చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసి, ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇక వడగట్టి , గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రతి రోజూ ఒక గ్లాసు ఉదయాన్నే తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.