కరోనా సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి విటమిన్ సి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందుకే సీమ చింతకాయలు తినడం వల్ల విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా ఇవి రక్తాన్ని బాగా శుద్ధి చేస్తాయి. అలాగే వీటి వల్ల లభించే ప్రోటీన్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. సీమ చింత కాయలు తినడం వల్ల శరీరంలోని ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి.