ఒక వస్త్రాన్ని తీసుకొని, దాన్ని తడిపి, ఉల్లిపాయలు కట్ చేసే బోర్డు మీద ఉంచాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు తరగడం మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ కంటి వెంట ఒక చుక్క నీటి బిందువు కూడా రాదు. సాధారణంగా ఉల్లిపాయలను తరిగినప్పుడు, అందులో నుంచి వచ్చే కొన్ని ఆమ్లాల కారణంగా కంటి వెంట నీళ్లు వస్తాయి. ఇక తడి వస్త్రాన్ని చాపింగ్ బోర్డు పై పెట్టి ఉల్లిపాయలు తరగడం వల్ల, ఉల్లిపాయలో ఉండే ఆమ్లాలను ఆ తడిగుడ్డ పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిపాయలో వుండే ఆమ్లాలు కళ్ళకు చేరవు. కాబట్టి కళ్ళు మండవు. అలాగే కంటి నుండి నీరు కూడా రాదు..