B.1.617 వేరియంటే ఈ విపత్తుకు కారణమని డబ్ల్యుహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు ఆందోళన కలిగించే వేరియంట్ గా గుర్తించగా.. ఇక త్వరలోనే డబ్ల్యుహెచ్ఓ కూడా గుర్తిస్తుందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఇది సహజంగా లేదా వాక్సిన్ ల ద్వారా వచ్చే యాంటీబాడీలను కూడా బోల్తా కొట్టి స్తుందని కూడా చెప్పుకొచ్చింది. అలాంటివి ఈ B1.617 వేరియంట్లు చాలా ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. అందుకే ఈ వేరియంట్ ను చాలా ఆందోళన కలిగించే వేరియంట్ గా గుర్తించవచ్చని తెలిపారు. అయితే ఈ వేరియంట్ దే మొత్తం బాధ్యత అని కూడా చెప్పలేము. అయితే కరోనా వెళ్లిపోయిందని చాలమంది బాధ్యతా రహితంగా తిరిగారని, అందువల్లే ఈ విపత్తుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.