కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కొత్తగా బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి వ్యాప్తి చెందుతోంది.జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.రక్తంతో కూడిన వాంతులు అవుతాయి. అంతేకాకుండా మానసిక స్థితి మారుతుంది. కళ్ళు, ముక్కు చుట్టూ చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. అంతేకాకుండా ఎంతో నొప్పి కూడా కలుగుతుంది. షుగర్ పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అలాగే అలసట,నీరసం, బద్ధకం గా అనిపించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.