గతేడాదిలో కరోనా ఐసీయూ అడ్మిషన్లలో 33 శాతం ఉండగా, ఈసారి మాత్రం దాదాపు 40 శాతం ఆడవారు ఐసీయూ అడ్మిషన్ లలో ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ సారి ఆడవారిపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.. ఇందుకు కారణం మగవారితో పోల్చుకుంటే కాస్త ఇమ్యూనిటీపవర్ ఆడవాళ్ళలో తక్కువగా ఉంటుంది.అందుకే ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల ఆడవాళ్లు బయట పనుల కోసం ఎక్కడికి వెళ్ళలేక , ఇంట్లో ఉంటూనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సమయానికి సరైన ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉండడానికి అలాగే వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారిలో కూడా రోగనిరోధక శక్తి పెరిగి, వారు త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా ఉంటుంది.ప్రభుత్వాలు ఇలా లాక్ డౌన్ పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలు..