ఇటీవల ఛాతీనొప్పి కూడా కోవిడ్ లక్షణమేనని వైద్యులు ధ్రువీకరించారు. దీనిని కొంతమంది వ్యక్తులను పరీక్షించడం ద్వారా తెలుసుకున్నారు. కొద్దిపాటి ఛాతీ నొప్పి వచ్చినా కూడా వైరస్ లక్షణమేనని నిర్ధారించారు. లంగ్స్ లో కొద్దిపాటి మంట వచ్చినా అది ఛాతీ నొప్పికి దారి తీస్తుంది. తద్వారా రోగులు ఛాతీ నొప్పితో ఎంతో బాధపడుతుంటారు. దీని బారిన పడ్డవారు సిటీ స్కాన్, ఎక్స్రే తీసిన తర్వాత పరిస్థితిని చూసి చికిత్స చేయించుకోవాలి.