ఆక్సిజన్ అందించేటప్పుడు స్టెరైల్ నీటికి బదులు సాధారణ నీటిని హ్యూమిడి ఫయర్ (తేమను అందించే పరికరం) ద్వారా అందించడం కూడా బ్లాక్ ఫంగస్ కు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై అహ్మదాబాద్ కి చెందిన సీనియర్ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్ అతుల్ అభ్యంకర్ మాట్లాడుతూ... బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ప్రధాన కారణం.. ఆక్సిజన్ ను ఉపయోగించి హ్యూమిడి ఫయర్ లే.ఈ హ్యూమిడి ఫయర్ లో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు, ఇలా వీరందరూ సాధారణ నీటిని వాడేస్తున్నారు. అందులో రకరకాలైన సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటి కారణంగా శరీరంలో ఫంగస్ ఏర్పడుతోంది" . అంటూ చెప్పుకొచ్చారు.