ఎవరికైనా జ్వరం వస్తే జీర్ణ శక్తి బాగా తగ్గిపోతుంది. దీంతో డాక్టర్లు తేలికగా అరిగే ఆహారాన్ని తీసుకోమంటారు. అలాంటప్పుడు సరిగ్గా జీర్ణం కాని మాంసాహారం తింటే దాంతో లివర్ పై ఎక్కువ భారం పెరుగుతుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. అలాంటప్పుడే పచ్చకామెర్లు వస్తాయి. కనుక జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం అసలు తినరాదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.