ఉదయం లేచిన అరగంటలోపే ఏదో ఒకటి తినాలి. రెండు కర్జూరాలు, నానబెట్టిన గింజలు, ఒక గుడ్డు తింటే చాలు.. ఇక అల్పాహారం అక్కర్లేదు. లేదంటే ఒక గ్లాస్ పాలు, కొన్ని బాదం గింజలు, రెండు ఇడ్లీలు తీసుకుంటే రోజంతా చురుగ్గా పని చేయగలరు. అల్పాహారానికి,భోజనానికి మధ్య ఆకలేస్తే ఒక గ్లాసు పండ్లరసం తాగడం మంచిదట.ఒక గ్లాసు పాలు,నానబెట్టిన బాదం గింజలు, పండ్ల ముక్కలు కొన్ని, బర్ఫీ లు తినడం వల్ల మనకి కడుపు నిండుతుంది. దీంతో అవసరమైన శక్తి లభిస్తుంది.