వాము మొక్క.. చిన్నపిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి వాము ఆకు మంచి మందు అని చెప్పవచ్చు. ప్రతిరోజు భోజనం అయ్యాక వాము ఆకులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి తక్కువగా ఉన్న వారిలో ఆకలి బాగా వేస్తుంది.చిన్నపిల్లలకు వాము ఆకు రసంలో తేనె కలిపి ఇస్తే, వ్యాధినిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి.తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకులను నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. ఏవైనా పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకులతో ఆ ప్రాంతంలో రుద్దినా విషం బయటకు వచ్చేస్తుంది.