గుమ్మడి కాయలో ఉండే పీచు, విటమిన్ సి గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ ఉండడంవల్ల నేత్ర సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. అందుకే చదువుకునే పిల్లలకు గుమ్మడికాయను ఎక్కువగా తినిపించాలి.