టీ కాఫీ అంటే రోజుకు మూడు నాలుగు సార్లైనా తాగడానికి సిద్ధమవుతుంటారు. కానీ అదే పాలు తాగాలంటే ఎవరు తాగడానికి ఇష్టపడరు. ముఖ్యంగా చిన్నపిల్లలు కాఫీ, టీ తాగడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అదే పాలు తాగండి అంటే దాన్ని ఏదో మెడిసిన్ మాదిరిగానే చూస్తారు. కానీ టీ, కాఫీల వల్ల ఎలాంటి లాభం లేకపోగా అనారోగ్యానికి గురవుతాం..కానీ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్న పిల్లలకు పాలు తాగిస్తే వారు దృడంగా తయారవుతారు. పాలలో ఉండే మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలలో ఆవు పాలు పిల్లలకు చాలా మంచివి. అయితే పిల్లలు పాలు తాగడం వల్ల ఎక్కువ బరువు పెరుగుతారని కొన్ని అపోహలు కూడా ఉన్నాయి.