దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దేశంలోని మిలియన్ల కొద్దీ ప్రజలు మొదటి వేసుకున్నారు. ఇంకా ప్రస్తుతం వ్యాక్సిన్ లు వేసుకోని వారు కూడా వ్యాక్సిన్ లు వేసుకుంటున్నారు. దేశంలో డెల్టా కేసులు నమోదవుతున్న నేపద్యంలో వ్యాక్సిన్ వేసుకోవడం అనేది తప్పనిసరిగా మారింది. వ్యాక్సిన్ లు వేసుకోవడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే దేశంలో కరోనా వ్యాక్సిన్ ల కొరతను తీర్చేందుకు భారత్ విదేశీయ వ్యాక్సిన్లకు కూడా అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విదేశీ వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.