ప్రస్తుతం గాలీ, నీరు అన్నీ కలుషితమే. ఇక గ్రామాల్లో పరిస్థితి పర్వాలేదనింపించినా పట్టణాల్లో మాత్రం స్వచ్చమైన గాలి, నీరు దొరకడం కరువైపోయింది. దాంతో అన్ని నగరాలలో నీటిని ఎంతో డబ్బు పెట్టి కొంటుండగా కొన్ని నగరాల్లో స్వచ్చమైన గాలి పీల్చేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోనూ కాలుష్యం ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నగరంలో రెండు ప్రాంతాల్లో మాత్రం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చని పీసీబీ తమ నివేధికలో వెల్లడించింది. జూబ్లీహిల్స్, ఉప్పల్ ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలు తక్కువగా ఉండి నాణ్యమైన గాలి ఉందట.