దేశంలో కరోనా కాస్త తగ్గుముకం పట్టినట్టు కనిపించినా కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 30వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్టు నివేధికలు చెబుతున్నాయి. అయితే గతంతో కంటే భారత్ లో కరోనా తగ్గుముకం పట్టగా త్వరలోనే థర్డ్ వేవ్ రాబోతుందని నిపుణులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా ఇండియాలో కరోనా డెల్టా-4 మ్యూటెంట్ వల్ల థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా డెల్టా-4 మ్యూటెంట్ తోనే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని బయోటెక్నాలజీ విభాగం కేంద్ర ప్రభుత్వానికి నివేధికలో తెలిపింది. ఇండియాలో ఉన్న మ్యూటెంట్ లను గుర్తించడానికి బయోటెక్నాలజీ విభాగం 90,115 నమూనాల జన్యుశ్రేణి పూర్తయ్యిందని...వాటిలో 62.9 శాతం నమూనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి తీవ్రమైన వేరియంట్ లను గుర్తించామని చెబుతున్నారు.