వంద కోట్ల డోసుల పేరిట మరోమారు అదే రీతిన ప్రచారం మోతకు మోడీ సర్కార్ సిద్ధమైంది. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసం వందకోట్ల డోసులను ఉపయోగించుకోవాలన్నదే బీజేపీ ఉబలాటం. టీకా పంపిణీ లో వంద కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదని, దేశ సంకల్ప బలానికి, నవభారతానికి ప్రతీక అని గత శుక్రవారం జాతినుద్దేశించి ప్రధాన మంత్రి గొప్పలు చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు వందకోట్ల డోసుల ఘనతే సమాధానమని ఆయన మాటల డోసులు పెంచ