నాన్ వెజ్ ప్రియులు మటన్ ను తినటానికి ఎంతో ఇష్టపడతారు. మటన్ తినటం వలన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మటన్ లో శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు అన్నీ ఉంటాయి. మటన్ లో ఫ్యాట్ తక్కువ ప్రమాణాలలో ఉండగా ప్రోటీన్లు, ఐరన్ ఎక్కువ ప్రమాణాలలో ఉంటాయి. శరీరానికి మటన్ మంచి పౌష్టికాహారం. మటన్ లో అధికంగా ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు పోషకాలను అందించి వాటిని ధృఢంగా ఉండేలా చేస్తుంది. 
 
మటన్ లో సోడియం తక్కువ మోతాదులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన మటన్ తినేవారిలో బీపీ, కిడ్నీ సమస్యలు తలెత్తవు. సరైన మోతాదులో మటన్ తింటే ఇన్ఫెక్షన్లు, టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చు. మటన్ ఎక్కువగా తినే వారిలో చర్మం ఎంతో కాంతివంతంగా ఉండటంతో పాటు ఎగ్జిమా, సొరియాసిస్ లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. 
 
మటన్ తినేవారికి ఐరన్ పుష్కలంగా అందటంతో బహిష్టు సమయాల్లో తలెత్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. పరిశోధకులు పరిశోధనల్లో మటన్ తినేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు. మటన్ ను తినే గర్భిణీలకు న్యూరల్ ట్యాబ్ వంటి సమస్యలు రావు. మటన్ లో ఉండే బీ12 వలన అధికంగా ఎర్రరక్తకణాలు ఏర్పడటంతో పాటు కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా శరీరానికి కూడా పెరుగుతుంది. మటన్ లో బీ1, బీ2, బీ3, బీ12, బీ9 ఇతర విటమిన్లు, ఓమేగా 3 మరియు ఒమేగా 6, అమైనో యాసిడ్స్, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: