కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. చైనాలో రోజూ వందల మంది దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా లో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపిస్తోంది. భారత్ లో మొదట్లో కేరళలో మూడు కేసులు నమోదైనా... ఆ తర్వాత వారు కోలుకున్నారు.
కానీ ఇప్పుడు కరోనా ఏపీలో ప్రవేశించినట్టు వార్తలు వస్తున్నాయి. తిరుపతి రుయా ఆస్పత్రిలో కరోనా వైరస్ కలకలం రేగింది. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీ లో మిషన్ వర్క్ కోసం ఈ నెల 17న తైవాన్ నుంచి భారత్ వచ్చిన ఓ తైవాన్ వ్యక్తి కరోనా లక్షణాలతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేరారు.
ఓ ప్రైవేటు కంపెనీ లో మిషన్ వర్క్ కోసం ఈ నెల 17న తైవాన్ నుంచి భారత్ వచ్చిన చెన్ చున్ హంగ్ జలుబు, దగ్గుతో ఆసుపత్రికి వచ్చారు. అసలే విదేశీ వ్యక్తి.. అందుకే రుయా వైద్యులు అతడిని కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని నమూనాలను పరీక్షల కోసం సికింద్రాబాద్ కి పంపించారు.