ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు చెప్పిన విషయం ప్రకారం.. చిన్నపిల్లలు టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకునేటప్పుడు పెద్ద వాళ్ళు గమనించాలని చెబుతున్నారు.. ఎందుకంటే టూత్ ప్లేస్ట్లో ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి దీనిని మింగడం వల్ల శరీరంలో ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుందట.. ఫ్లోరైడ్ అనే వ్యాధి తాగునీటి ద్వారా సంభవిస్తుంది. ఈ ఫ్లోరోసిస్.. టూత్ పేస్ట్ వల్ల కూడా సంభవిస్తుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను.. టూత్ పేస్ట్ తో బ్రష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి..లేకపోతే ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.అయితే డాక్టర్లు చెబుతున్న విషయం ప్రకారం.. చిన్న పిల్లలు దంతాలు శుభ్రం చేసుకోవడానికి బఠాణీ గింజ కంటే తక్కువ మొత్తంలో టూత్ పేస్ట్ ఇవ్వాలట.. ఇక ఈ టూత్ పేస్ట్ వల్ల ఉపయోగం ఏమిటంటే..దంతాలకు ఫ్లోరైడ్ అందించడం అలాగే కొన్ని సందర్భాలలో దంతాలను తెల్లగా మార్చడానికి మాత్రమే మనం ఉపయోగిస్తాం..
ఫ్లోరోసిస్ రావడం వల్ల ఆరేళ్ల లోపు పిల్లల దంతాలు మారిపోతాయి.. అంతేకాదు మెడ , భుజాలు , వీపు భాగాల్లో బలహీనంగా మారవచ్చు..అంతే కాదు ఎల్లప్పుడూ ఉండే అవకాశం కూడా ఉంటుంది.. అందుకే చిన్న పిల్లలకు టూత్ పేస్ట్ ఇవ్వరాదు.