నిద్ర లేమిని అధిగమించాలంటే..?

నిద్రలేమి ఎన్నో రకాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమిని దూరం చేసుకోడానికి ఆయుర్వేదంలో దొరికే కొన్ని రకాల చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. రాత్రుళ్లు నిద్ర సరిగా పట్టకపోతే ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సాధారణ నిద్రకు మేల్కొనే సమయం కూడా చాలా ముఖ్యం. ప్రతి రోజూ కూడా సరైన సమయానికి పడుకోకపోతే నిద్రలేమి సమస్య పెరుగుతుంది.ఇక నిద్ర లేమిని అధిగమించాలంటే  మీరు మంచి సుఖమైన నిద్ర పొందడానికి కుంకుమపువ్వు చాలా బాగా సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు కుంకుమపువ్వు వేసి కలిపి తాగడం వల్ల రాత్రి చక్కగా నిద్ర బాగా పడుతుంది.ఇంకా అలాగే నిద్రలేమి సమస్యకు మరో ఇంటి చిట్కా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మీకు రాత్రిపూట సరిగా నిద్రపట్టక అనేక రకాలుగా అవస్థలుపడుతున్నట్టయితే, జాజికాయ చాలా బాగా పని చేస్తుంది. ఇది మంచి నిద్రను పొందేందుకు ఎంతగానో సహాయపడుతుంది. 


కాబట్టి మీరు పడుకునే ముందు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని వేసి కలుపుకుని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా చాలా మంచి నిద్ర పడుతుంది.ఇంకా అలాగే పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది రాత్రి నిద్రను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.అందుకే మీరు రాత్రి నిద్ర రాకపోతే పడుకునే ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ ఈ పాలు తాగండి.నిద్రలేమితో ఎక్కువగా బాధపడుతుంటే తలకు, పాదాలకు నూనె రాసుకుని కాసేపు బాగా మసాజ్ చేయడం వల్ల కూడా చాలా ఉపశమనం పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో బాగా మర్దన చేయాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం ఖచ్చితంగా మానేయాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ప్రశాంతమైన, మంచి నిద్రను పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: