హైదరాబాద్‌లో చలికాలం వచ్చిందంటే సీతాఫలాలు తోపుడు బండ్లు ప్రత్యక్షమవుతాయి. దీన్ని చుట్టూ చాలామంది జనాలు చేరి సీతాఫలాలను కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి పైగా పోషకాలు కలిగి ఉన్నవి. అయితే, హైదరాబాద్‌లోని హయాత్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఒక మహిళ సీతాఫలాలు కొని ఇంటికి తీసుకెళ్లి కోసి చూస్తే అందులో పురుగులు ఉండటం చూసి షాక్ అయింది. రోడ్డున పండ్లు అమ్ముకునే వారి నుండి సీతాఫలాలు కొనే వారందరికీ ఈ సంఘటన ఆందోళన కలిగించింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే పండ్లను కొనుగోలు చేసే ముందు బాగా పరిశీలించడం చాలా ముఖ్యం.

అయితే సీతాఫలాలు చాలా ఆరోగ్యకరమైన పండ్లు. వీటిలో బి6, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యానికి మంచివి. సీతాఫలాలలో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం రాకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉన్న సహజ చక్కెర శరీరానికి శక్తిని ఇస్తుంది కాబట్టి పెద్దలు, పిల్లలు అందరికీ మంచి స్నాక్.

సీతాఫలాలు చాలా ఆరోగ్యకరమైన పండ్లు అయినప్పటికీ, వీటిని సరిగ్గా తినకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా పక్వానికి వచ్చిన లేదా సరిగ్గా నిల్వ చేయని సీతాఫలాలు పాడై పోయి, వాటిలో హానికరమైన బ్యాక్టీరియా లేదా పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి పాడైన సీతాఫలాలు తింటే వాంతులు విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఆహార విషం వచ్చే అవకాశం ఉంది. అలాగే, చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు సీతాఫలాలు తక్కువ మొత్తంలో తినాలి.

సీతాఫలాలు తినే ముందు వాటిని బాగా కడిగి తీసుకోవడం చాలా ముఖ్యం. పగళ్లు, రంగు మారడం లేదా అసాధారణ వాసన వస్తున్నట్లు ఉంటే వాటిని తినకూడదు. సీతాఫలాలు చాలా ఆరోగ్యకరమైన పండ్లు అయినప్పటికీ, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే వాటిని తాజాగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: