అల్లం టీ రోజూ తాగితే అమృతమా? విషమా?
వాతావరణంలో మార్పులు, అదీ ఆకశ్మిక మార్పులు, అకాలంలో అప్పుడప్పుడూ కురిసే వర్షాల వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు అల్లం టీ చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది. మరి ఈ అల్లం టీ లో గల ప్రయోజనాలను తెలుసుకుందాం.
అల్లం టీ లో విటమిన్ సి, మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఈ అల్లం టీ ని ఎలా చేయాలో చూద్దాం. కప్పు నీటిలో కొద్దిగా అల్లం తరుగు, టీ పొడి వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత వడకట్టుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
పాలతో చేసుకునే టీ లో కూడా కొద్దిగా అల్లం ముక్కను వేసుకుని వడకట్టి తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధశక్తిని పెంచుటలో చక్కగా పనిచేస్తుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
అల్లంలో ఉండే ఖనిజాలు, అమినోయాసిడ్స్ రక్తప్రసరణ సక్రమంగా జరుగేలా చేస్తాయి. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా అధికబరువు తగ్గుతారు. మహిళలకు నెలసరి సమస్యలో వచ్చే నొప్పులు కూడా తొలగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఆయుర్వేద ప్రకారం అల్లంలో మన
శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అల్లంను నిత్యం మనం
కూరల్లో వేస్తుంటాం. దీంతో కూరలకు చక్కని రుచి వస్తుంది. అయితే రుచికే కాదు,
ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ
క్రమంలోనే అల్లంతో టీ తయారు చేసుకుని నిత్యం తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో
ఇప్పుడు తెలుసుకుందాం.
1. అల్లం టీని తాగి ప్రయాణాలు చేస్తే వాంతులు రాకుండా ఉంటాయి. కొందరికి కార్లు, బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్రయాణానికి ముందు అల్లం టీ తాగితే ఫలితం ఉంటుంది.
2. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా సమస్యలు ఎదుర్కొనేవారు అల్లం టీని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. కీళ్ల నొప్పులు ఉన్నవారు అల్లం టీ తాగితే ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. అల్లం టీని రోజూ తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
5. రుతుక్రమం సరిగ్గా ఉండని మహిళలు అల్లం టీ తాగితే ఉత్తమం. అలాగే శరీర రోగ నిరోధ శక్తి కూడా అల్లం టీతో పెరుగుతుంది.
6. బాగా తలనొప్పిగా ఉంటే అల్లం టీ తాగితే వెంటనే నొప్పి తగ్గిపోతుంది.
7. అల్లం టీని నిత్యం తాగుతుంటే అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యల నుంచి బయట పడవచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.