కరోనా వచ్చినప్పటి నుండి పిల్లల్లో మరీ ముఖ్యంగా టీనేజర్లలో నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోతున్నాయట. పాఠశాలలు తెరుచుకుంటాయా లేదా అన్న అనుమానాలు, పై తరగతికి వెళ్తామా లేదా అన్న సందేహాలు, పరీక్షలు ఉంటాయా ఉండవా అన్న ఆలోచనలు, జీవన విధానంలో నెలకొన్న గజిబిజి.. మొదలగునవి వారిలో నెగెటివిటీని పెంచుతున్నాయని అంటున్నారు.