పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తరచూ అనారోగ్యం పాలవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు తరచూ వస్తూ ఉంటాయి. మరి పిల్లలలో రోగనిరోధక శక్తిని ఎలా పెంపొందించాలి..? వారికి ఎలాంటి ఆహారం ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనే సందేహం అందరికి ఉంటుంది.