పఠనం మెదడులోని వివిధ భాగాల మధ్య కొత్త కనెక్షన్లను పెంచుతుంది. 2013లో జరిగిన అధ్యయనం ప్రకారం నవలలు మెదడును చురుగ్గా చేస్తాయి. భాషపై పట్టు పెరుగుతుంది. రీడింగ్ మెదడులోని న్యూరాన్లను సృష్టిస్తుందని న్యూయార్క్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ సబ్రినా రోమనోఫ్ చెప్పారు. ఈ ప్రక్రియను న్యూరోజెనిస్ అని పిలుస్తారు.