పిల్లలు పుట్టినప్పుడు ఎంత జాగ్రత్త ఉంటారో వాళ్ళు పెరుగుతున్న సమయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అయితే బిడ్డకు అన్నింటి కంటే ముఖ్యంగా తల్లి పాలు ఇవ్వడం వలన కావాల్సిన అన్ని పోషకాలూ లభిస్తాయి. ముఖ్యంగా బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలూ తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి.