వ్యాధి నిరోధక అనేది సహజంగా ఉంటుంది. మనిషి అనారోగ్యం బారినపడకుండా ఈ వ్యాధి నిరోధకత తోడ్పడుతుంది. ఇక వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని మనిషిలో పెంచవచ్చు. ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి పిల్లలను కాపాడటానికి వ్యాక్సిన్లతో ఇచ్చే కృత్రిమ రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. తద్వారా వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఆగుతాయి కూడా. వ్యాక్సిన్లు మనలోని ఆల్రెడీ సహహజంగానే ఉన్న రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి.