ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా స్మార్ట్ ఫోన్ వల్ల క్షణాల్లో తెలిసిపోతుంది. అంతే కాదు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన బంధువులకు లేదా మనకు కావాల్సిన వారికి ఉత్తరం రాసి వారికి చేరిందా లేదా తిరిగి వారి వద్ద నుంచి సమాధానం వచ్చేందుకు పది రోజులకు పైగా పడుతుండేది. మరికొంత కాలం గడిచిన తర్వాత ల్యాండ్లైన్లు అందుబాటులోకి వచ్చాయి. ల్యాండ్ ఫోన్ల వల్ల కొంచెం సాంకేతిక పరిజ్ఞానం సాధించాం.