చలికాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే సీజన్ ఇది. గొంతు నొప్పి, జలుబు, కడుపులో ఇన్ఫెక్షన్, న్యుమోనియా, చెవి ఇన్ఫెక్షన్, ఆస్తమాలతో పాటు చర్మం పొడిబారి దురద రావడం లాంటివి వింటర్లో చాలా మంది పిల్లలు ఎదుర్కొనే సమస్యలు. పిల్లల్లో సరైన ఇమ్యూనిటీ ఉంటే ఇలాంటి సమస్యలు దగ్గరకు రాకుండా చూసుకోవచ్చట.