చిన్నపిల్లల ఆహారం విషయంలో తల్లులు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నెలల పిల్లలకు ఎక్కువగా తల్లి పాలను ఇస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే పిల్లలకు అయిదారు నెలల వయసు వచ్చేవరకు తల్లిపాలు లేదా పిల్లల వైద్యులు సూచించిన ఫార్ములా పాలు మాత్రమే పట్టడం శ్రేయస్కరం. అయిదు నెలలు నిండిన తరువాత ఘనాహారం మొదలు పెట్టినా తల్లిపాలను ఇవ్వడం మానకూడదు.