చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తారో ఎవరికీ అర్ధం కాదు. అయితే కొన్ని సందర్భాలలో పిల్లలు ఏడవడం మంచిదే అని వైద్యులు చెబుతుంటారు. అయితే కొన్నిసార్లు పసిపిల్లలు గంటల తరబడి ఆపకుండా ఏడుస్తుంటారు. అలాంటి సమయాలలో ఏం చేయాలో దిక్కుతోచక తల్లిదండ్రులు సతమతమవుతూ ఉంటారు. ఈ విధంగా పిల్లలు ఏడవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చైల్డ్ సైకియాట్రిస్ట్ నిపుణులు తెలియజేస్తున్నారు.