పిల్లలు ఎదుగుదల సరిగ్గా ఉండాలంటే వారికీ సరైన పోషకాలు ఉన్న ఆహారం అందించాలి. అయితే చాల మంది పిల్లలు తగినంత పోషకాలు ఉన్న ఆహారాన్ని తినడానికి నిరాకరించినప్పటికీ, వారికి సరైన పోషకాలను ప్రతిరోజు ఖచ్చితంగా అందించడం చాలా అవసరం. మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడం వలన పిల్లలలో విటమిన్ ఎ, ఐరన్, జింక్, కాల్షియం, విటమిన్ డి వంటి సాధారణ లోపాలను నివారించడానికి కాలసిన అన్ని సాధనాలను ఇస్తుంది.