చిన్న వయసులో పిల్లలు ఎంత ఎక్కువగా తింటే శరీరంలో కండరాలు, ఎముకలు గట్టిగా ఉంటాయని తల్లీదండ్రులు భావిస్తుంటారు. పిల్లల బరువు విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన జీవన శైలికి బరువు ఎంతో అవసరం. ఈ విషయం పిల్లలకి తెలియదు. చిన్న వయసులో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది.