శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిన్న పిల్లల్లో కళ్లు దెబ్బతింటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చేతులకు శానిటైజర్ రాసుకున్న తర్వాత పిల్లలు తమకు తెలియకుండానే కళ్లు తుడుచుకుంటున్నారని, దీనివల్ల కళ్లపైప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 24 మధ్య పిల్లల కళ్లు దెబ్బతిన్న కేసులు ఏకంగా ఏడు రెట్లు పెరిగడం గమనార్హం.