పిల్లలకు సరైన పోషకాలు అందకపోడంతో పిల్లలో ఎదుగుదల తగ్గుపోతుంది. ఇక పిల్లల్లో శారీరక ఎదుగుదలతో పాటూ.. మానసిక ఎదుగుదల కూడా అత్యంత ముఖ్యమే. ఈ రోజుల్లో మనందరికీ ఒత్తిడి కామన్. పిల్లలు పెద్దవాళ్లయ్యాక... వాళ్లకు ఒత్తిడి మరింత పెరుగుతుంది. సో, వాళ్లకు టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి తట్టుకోవడం నేర్పాలి. చదువులో ఎప్పుడైనా వెనకబడితే ధైర్యం చెప్పాలి. ఏదైనా పొరపాటు జరిగితే.. ఏం కాదు డోంట్ వర్రీ అని సరైన పద్ధతిలో నడిపిస్తే... వారిలో ధైర్యం పెరుగుతుంది.