ఉదయాన్నే లేవాలి అంటే ఎవరికీ అయినా చిరాకుగానే ఉంటుంది. ఇక చిన్నపిల్లలకు మరి చిరాకుగా ఉంటుంది. ఇక ఉదయాన్నే తల్లుల అరుపులు పిల్లల ఏడుపులు ఇల్లంతా ఒక గందరగోళానికి గురవుతుంది.పొద్దు పొద్దున్నే ప్రశాంతం గా ఉండవలిసిన ఇల్లు ఇలా కేకలతో తిట్లతో అరుపులతో ఉంటే ఆ పిల్లల దగ్గరనుండి పెద్దవారి వరకు ఆ రోజంతా మనస్సు కల్లోలం గా నే ఉంటుంది. ఇలా వెళ్లిన పిల్లలు దేని మీద శ్రద్ధ చూపలేరు.