పిల్లలు ఆరోగ్యాంగా ఎదగాలంటే పిల్లలకు సరైన పోషకాలు ఉన్న ఆహారం అందించాలి. అయితే పిల్లలకు అందించే పోషకాహారంలో నెయ్యి ఒక్కటి. దీనిని పిల్లలకు పెట్టడం వలన వారికీ ఎదుగుదల మంచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్ సమస్య వస్తుందని అందరి నమ్మకం. అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి.