వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పిల్లలకు తరచూ సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ సీజనల్ వ్యాధుల వల్ల ఎంతో ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కాలానుగుణంగా వచ్చే ఫ్లూ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని.. అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ సమస్య తీవ్ర రూపం దాల్చుతుందని వైద్యులు చెబుతున్నారు.