పిల్లలు పరీక్షల సమయంలో సరిగ్గా తిండి తినరు. కానీ పిల్లలకు పరీక్షల సమయంలో సరైన ఆహారం అందించాలి. ఇక పిల్లలకు రోజుకి మూడు సార్లు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మోడల్ కంటే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులకి నాలుగైదు సార్లు కొంచెం కొంచెంగా పెట్టడం మంచిది. వారికి నచ్చే జంక్ ఫుడ్ యొక్క ఆల్టర్నేటివ్స్ ని ఇంట్లోనే తయారు చేసి వారికి పెట్టండి.