తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మన పూర్వీకులు భోజనం కాగానే తాంబూలం వేసుకునేవారు. తాంబూలాన్ని పాన్ అనికూడా అంటారు. తమలపాకు సున్నం రాసి, పోకలు, రకరకాల దినుసులు, పుదీనా వంటివి అందులో చేర్చి తాంబూలం చుట్టుకునేవారు. తాంబూలంలో వాడే పదార్థాలన్నీ ఏదో ఒక రకంగా ఆరోగ్యానికి ఉపయోగపడేవి ఉండేవి.