పుట్టిన పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేవరకు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిల్లలు పెరిగి పెద్దకావడానికి ఆహారం ముఖ్యం. హితవయిన ఆహారం మితంగా తినాలని పెద్దవాళ్లంటారు. ఎదిగే శిశువుకు ఎముకలు గట్టిపడి , కండరాలు కట్టి , ఆరోగ్యం చక్కగా ఉండాలంటే తినే ఆహారం పుష్టికరమైనదిగా వుండాలి . పుష్టినీ, ఆరోగ్యాన్ని ఇవ్వడంలో పాపాయికి అమ్మపాలు అమృతం వంటిది.